గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన ఘటన అమృత్ పాల్ సింగ్.. సినిమా పక్కిలో అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ఛేజ్ చేసిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.. దేశమంతా ఖలిస్థాన్ ఉద్యమ నేత అమృత్ పాల్ సింగ్ పంజాబ్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. పంజాబ్ పోలీసుల కు చిక్కకుండా తిరుగుతున్న వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్‌సింగ్ కొత్త వీడియో బయటకు వచ్చింది.ఇప్పుడు ఇది పోలీసులకు మరో సవాల్ మారింది..
ఆ వీడియోలో..ఎవరికి భయపడడం లేదని . తనను ఎవరు ఏమి చేయలేరని అన్నారు అమృత్‌పాల్. పంజాబ్ పోలీసులు తన వెంట్రుకలను కూడా టచ్ చేయలేరని సవాల్ విసిరాడు. భగవంతుడి ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు పోలీసులకు తనను పట్టుకోలేరని అన్నారు. అమృతపాల్ సింగ్ తనపై అణిచివేత సమయంలో సిక్కు యువకులను అరెస్టు చేసినందుకు పంజాబ్ పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు.
మార్చి 18న తప్పించుకున్న తర్వాత అమృతపాల్ సింగ్ తన మొదటి వీడియోను విడుదల చేశాడు. పెద్ద సంఖ్యలో సిక్కులు తరలివచ్చి వైశాఖంలో సర్బత్ ఖల్సాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశాడు. అకాల్ తఖ్త్ జతేదార్ ఆదివారం అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసిన సమావేశం తర్వాత జతేదార్ తీసుకున్న చొరవను ప్రస్తావిస్తూ వీడియో రికార్డ్ చేశాడు అమృత్ పాల్. వీడియోలో, తాను చార్డీ కలాన్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు అమృతపాల్ సింగ్..అమృత్‌పాల్ లొంగిపోవడానికి సిద్దమయ్యాడని పోలీసులు ప్రకటించిన రోజే ఈ కొత్త వీడియో బయటకు రావడం సంచలనం రేపుతోంది.
#BREAKING
In first a video after police action Waris Punjab De chief #AmritpalSingh asking to call Sarbat Khalsa on the occasion of Baisakhi and also talking about arrest of his aides and later their detention in Assam jail. pic.twitter.com/PWHX3q9XnS— Harsimran Singh ਹਰਸਿਮਰਨ ਸਿੰਘ ہرسمرن سنگھ (@harsimrans307) March 29, 2023
అమృత్‌సర్ , హొషియార్‌పూర్ పరిసర ప్రాంతాల్లో అమృత్‌పాల్ తిరుగుతున్నట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.కపూర్తాలాలో అమృత్‌పాల్ వాడిన మరో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఇదిలావుంటే, పంజాబ్ నుంచి మారు వేషంలో పరారైన అమృత్ పాల్ సింగ్ తొలుత హర్యానా వెళ్లినట్టుగా ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు..ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది..