రోజు ఒకటే ఫుడ్ అంటే.. బోర్ కొడుతుంది. బిర్యానీ కూడా వరుసగా వారం తింటే వెగుడుకొడుతుంది. అలాంటిది ఓ మనిషి 24 ఏళ్లుగా కేవలం కొబ్బరినీళ్లు, కొబ్బరి మాత్రమే తింటున్నారు. కేవలం టీ తాగి బతికిన వాళ్లను చూసి ఉంటారు. కానీ కేవలం కొబ్బరి నీళ్లు అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..! అతని పేరు బాలకృష్ణన్.
బాలకృష్ణన్ 24 సంవత్సరాలుగా కొబ్బరి ఆహారం మాత్రమే తీసుకుంటున్నాడు. ఈ వ్యక్తి గత 24 సంవత్సరాలుగా కేవలం కొబ్బరి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నాడు.
కడుపు గ్యాస్‌కు సంబంధించిన సమస్య
వీడియోలో షహనాజ్.. బాలకృష్ణన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. బాలకృష్ణన్ మాట్లాడుతూ.. 24ఏళ్ల క్రితం కడుపులో గ్యాస్ సంబంధిత సమస్యను ఎదుర్కొన్నానని.. (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి GERD). ఆ వ్యాధి తనిని ఎంతగా వేధించింది అంటే తన శక్తినంతా కోల్పోయానని.. ఆ తర్వాత అకస్మాత్తుగా కొబ్బరినీళ్లే తాగాలని నిర్ణయించుకున్నాడట.. అప్పటి నుంచి ఇలా కొబ్బరి కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నట్లు బాలకృష్ణన్ అంటున్నారు.
కొబ్బరిలో కాల్షియం, మెగ్నీషియం సహా అనేక ఖనిజాలు
కొబ్బరిలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. పోషకాల కారణంగా, అతని శరీరం మళ్లీ బలపడింది. ఈ వార్త వైరల్ న్యూస్ విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. గ్రెడ్ వ్యాధి నేడు చాలామందికి ఉంటుంది.. కానీ ఇలాంటి చికిత్స మాత్రం ఎక్కడా చూసి ఉండరు.
ఇలా చేయడం వల్ల అతను ఆరోగ్యంగా ఉన్నాడని అందరూ ఉంటారని లేదు. కాబట్టి మీలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఇలానే ట్రేయాలి అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. అందరీ శరీరం ఒకేలా ఉండదు. ఓ బామ్మ కేవలం లిక్విడ్ తాగుతూ 50 ఏళ్ల నుంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకో బామ్మ కేవలం టీ తాగి మాత్రమే ఉంటుంది. ఇలా అక్కడా ఇక్కడా ఉంటారు అంతే..!