ఇడ్లీ ఏటీఎం టేస్ట్‌ ఎలా ఉంది..? : ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌

-

బిజినెస్ పనుల్లో క్షణం తీరిక లేకుండా గడిపే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. మిలీనియల్స్ కి దీటుగా ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇడ్లీ ఏటీఎంలో ఇడ్లీ టేస్ట్ ఎలా ఉందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇంతకీ ఇడ్లీ ఏటీఎం ఏంటి అనుకుంటున్నారా..?

బెంగళూరులో ఒక స్టార్టప్‌ కంపెనీ ‘ఇడ్లీ ఏటీఎం’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను ట్యాగ్ చేసి ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇడ్లీలు ఎలా ఉన్నాయి..? అంటూ బెంగళూరు ప్రజలను ప్రశ్నించారు.

‘‘చాలా మంది రోబోటిక్‌ ఫుడ్‌ ప్రిపరేషన్‌, వెండింగ్‌ మెషీన్లను రూపొందించడానికి ప్రయత్నించారు. అయితే, ఇది ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. ఇందులోని పదార్థాలు తగినంతగా రిఫ్రెష్‌ చేస్తాయని తేలింది. ఈ మెషీన్‌లోని ఇడ్లీల రుచి ఎలా ఉంది..? ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు, షాపింగ్‌ మాల్స్‌లో కూడా ఈ ఇడ్లీ ఏటీఎంను పెడితే చూడాలనుకుంటున్నా’’ అంటూ రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version