బుల్లితెర గ్లామర్ క్వీన్ గా, యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు సాక్షి టీవీలో న్యూస్ ప్రెసెంటర్ గా పనిచేసిన ఈమె జబర్దస్త్ షో ద్వారా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంది. ఇక అక్కడ సొంతం చేసుకున్న హోదాతో సినిమాలలో కూడా అవకాశాలు రావడం గమనార్హం. ఇకపోతే జబర్దస్త్ లో అనసూయతో పాటు సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న రష్మీ గౌతమ్, సుడిగాలి సుదీర్ , హైపర్ ఆది, మహేష్ , గెటప్ శ్రీను, రచ్చ రవి, ఆటో రాంప్రసాద్, చమ్మక్ చంద్ర ఇలా చాలామందికి కెరియర్ ఉండేది కాదు.. అప్ కమింగ్ నటులుగా వెలుగులోకి రావడం జరిగింది. అంతే కాదు వీరంతా ఆర్థికంగా, కెరియర్ పరంగా ఒక స్థాయికి వెళ్లారని చెప్పవచ్చు.
ఇక రికార్డు స్థాయిలో టిఆర్పి రేటింగ్స్ సాధించడంతోపాటు తొమ్మిది సంవత్సరాలు తిరుగులేకుండా సాగిన జబర్దస్త్ కి ఇప్పుడు గడ్డ కాలం ఎదురైందని చెప్పాలి. ఇప్పుడు వివిధ కారణాలతో జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నారు. తాజాగా యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇకపోతే అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడానికి గల కారణాలేంటి అనే విషయంపై ఆమె నోరు విప్పలేదు.. కానీ ఎట్టకేలకు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.