చంద్రబాబు సూపర్-6లో రూ.4వేల పెన్షన్ మాయం : సీఎం జగన్

-

చంద్రబాబుకు ఓటు వేస్తే.. చంద్రముఖి తిరిగి వస్తుందని సీఎం జగన్ చెప్పారు. ఆయన ఇప్పుడే సూపర్ -6లో రూ.4000 పెన్షన్ హామీని ఎత్తేశారని మండిపడ్డారు. కనిగిరి సభలో మాట్లాడుతూ.. మీ జగన్ అధికారంలో ఉంటేనే పెంచిన అమ్మఒడి, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, కళ్యాణమస్తు, షాదీ తోఫా, రైతు భరోసా, ఇన్ పుట్ సబ్సీడీ అందుతాయి. విలేజ్ క్లినిక్ లో వైద్యం, ఇంటికే పౌరసేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

57 నెలలుగా పెన్షన్లను అవ్వాతాతలకు ఇంటి వద్దే అందించామని తెలిపారు. చంద్రబాబు పాపిష్టి కళ్లు వారిపై పడటంతోనే ఇబ్బందులు తలెత్తాయన్నారు. మాయమాటలతో 2014 లో కూటమి ప్రజలను మోసం చేసింది.. ఇప్పుడు మళ్లీ వస్తోందని విమర్శించారు సీఎం జగన్. చంద్రబాబు మేనిఫెస్టోలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా.? అని ప్రశ్నించారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మితే ప్రజలు మోస పోవడం పక్కా అన్నారు. మీ బిడ్డ జగన్ కి ఓటు వేస్తే.. మీకు మళ్లీ సంక్షేమ ఫలితాల అందుతాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version