ఏపీ సీఎస్, డీజీపీలకు హైకోర్టు కీలక ఆదేశాలు

-

ఏపీలో పలు చోట్ల అల్లర్లు కొనసాగుతున్నాయి.మే 13న పోలింగ్ సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి. వైసీపీ, టీడీపీ నాయకులు కొట్టుకున్నారు. ఈ దాడుల్లో రెండు వర్గాలకు చెందిన చాలా మందికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు చాలా గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఘర్షణలను కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడో ఓ చోట ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో ఓ పిటిషనర్ హైకోర్టుకు వెళ్లారు. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను కోర్టుకు సమర్పించారు.

ఎన్నికల తర్వాత కూడా దాడులు కొనసాగుతున్నాయని, అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని పిటిషన్లో పేర్కొన్నారు. తక్షణమే ఘర్షణలను అరికట్టాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గురువారం ధర్మాసనం విచారణ చేపట్టింది. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మసనం… వెంటనే గొడవలు అరికట్టాలని సీఎస్ తో పాటు డీజీపీ, సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version