ఏపీ ఉద్యోగులకు బిగ్‌ షాక్‌.. డీఏ చెల్లింపుపై రాని ప్రకటన !

-

 

ఏపీ ఉద్యోగులకు బిగ్‌ షాక్‌. డీఏ ప్రకటనకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరీక్షణతోనే కాలం గడుపుతున్నారు. కేంద్రం తాజాగా తమ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరికి సంబంధించిన నాలుగు శాతం డిఏ, డిఆర్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగ సంఘాలతో చర్చలతోనే కాలం వెల్లదీస్తోంది. గతేడాది జనవరి, జూలై ఈ ఏడాది జనవరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మూడు డిఏల ఊసెత్తడం లేదు.

ఈ ఏడాది జనవరిలో సీఎం జగన్ ను ఉద్యోగ సంఘాల నాయకులు కలిసినప్పుడు డిఎల్లో ఒకటి సంక్రాంతి కానుకగా ఇస్తారని లీకులు వెలబడ్డాయి. ఆ వెంటనే కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రకటనలు చేసెసాయి. సంక్రాంతి వచ్చి వెళ్లిన డిఏ ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు. మంత్రుల కమిటీ ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఉగాది పండుగకైనా ఒక డిఏ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. ఈ విన్నపంపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించిందని, ఉగాది సమయంలో ఉత్తర్వులు వస్తాయని నాయకులు మరోసారి ప్రకటించారు. ఉగాది వెళ్లిపోయినప్పటికీ ఉత్తర్వులు రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version