హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. కరోనా కాలంగా ఇప్పటివరకూ మూత పడిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ ఎత్తివేత, కరోనా కేసుల తగ్గుముఖం, సినిమా కార్మికుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని థియేటర్లు తెరుచుకునేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతించాయి. దీంతో సినిమా థియేటర్లు ఈ రోజు ఓపెన్ అయ్యాయి. ఈ సందర్బంగా తిమ్మరుసు, ఇష్క్ సినిమాలు విడుదల అయ్యాయి. దీంతో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వెళ్తున్నారు.
అటు హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఇష్క్, తిమ్మరుసు సినిమాలు విడుదల అయ్యాయి. చాలా రోజుల తర్వాత సినిమాలు విడుదల కావడంతో ప్రేక్షుకులు ప్రస్తుతం ఉపశమనం పీల్చుకున్నారు. ఈ రెండు సినిమాలను చూసేందుకు థియేటర్లకు వెళ్లారు. ఇన్నిరోజులకు థియేటర్లు తెరుచుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. పెద్ద హీరోల సినిమాలను కూడా త్వరగా విడుదల చేయాలని కోరారు. మరోమైపు థియేటర్ నిర్వాకులు కూడా హర్షం వ్యక్తం చేశారు. చాలా కాలంగా సినిమా థియేటర్లు మూసివేయడంతో తమకు చాలా నష్టం వచ్చిందని. ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు. అటు కార్మికులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఉపాధి లేక చాలా కష్టాలు అనుభవించామని, ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో మళ్లీ బిజీ అవుతామని అంటున్నారు.