తిరుమల భక్తులకు అలర్ట్. తిరుమల నడక మార్గంలో చిన్నారి లక్షితను చంపిన చిరుతను అధికారులు బందించగా… తిరుమల నడక మార్గంలో మరో మూడు చిరుతలు సంచరిస్తున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించినట్లు వెల్లడించారు.
భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే టీటీడీ ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయన్నారు.
కాగా, తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రంలో మరో చిరుత సంచారం కలకలం రేపింది. తాజాగా మరో చిరుత పులి భక్తులకు కనిపించడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నడకదారి లో ఇవాళ ఉదయం కొందరు భక్తులు వెళ్తుండగా చిరుత పులి కనిపించింది. దీంతో వారు అక్కడ నుంచి పరుగులు తీశారు. అయితే భక్తుల అరుపులతో చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో టిటిడి అధికారులు అక్కడ అప్రమత్తమయ్యారు. ఆ చిరుత రాకపై ఆరా తీస్తున్నారు.