ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 93 % పింఛన్ల పంపిణీ పూర్తి అయింది. రెండున్నర రోజుల వ్యవధిలోనే 61,37,464 మంది లబ్ధిదారులకు రూ.1,847.85 కోట్లను అందించింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల వద్ద బుధవారం మధ్యాహ్నం నుంచి పంపిణీ ప్రారంభించి, శుక్రవారం సాయంత్రానికి 93.42 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తి చేసింది. శనివారం కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సచివాలయాల వద్ద పంపిణీ కొనసాగుతుంది. ఇవాళే చివరి రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కొనసాగనుంది.