మూడేళ్ల బాలుడి మూతిపై వాత..అంగన్వాడీ ఆయా నిర్వాకం..?

-

బాలుడు అంగన్వాడీ కేంద్రంలో ఉండడం లేదని అక్కడ పనిచేస్తున్న ఆయా మూడేళ్ల చిన్నారి మూతి పై వాత పెట్టి గాయపరిచిందని పిల్లవాడి తల్లి ఆరోపిస్తోంది. అనంతపురం జిల్లా కొవ్వూరు నగర్ లో లక్ష్మీదేవి,శింగారెడ్డి దంపతులు నివసిస్తున్నారు.వీరికి ఈశ్వర్ కృష్ణారెడ్డి అనే మూడు ఏళ్ల బాలుడు ఉన్నాడు.కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి ఈ చిన్నారిని పంపిస్తున్నారు.రోజులాగే ఈ రోజు కూడా వదిలిపెట్టి వచ్చామని తల్లిి చెబుతుంది.బాలుడు అమ్మ కావాలంటూ ఏడవడం తో ఆయా చెన్నమ్మ..

బాలుడి మోడీపై వాత పెట్టిందని తల్లి ఆరోపిస్తోంది.దీంతో బాలుడి మూతిపై బొబ్బలుు వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది.ఆ తర్వాత కర్రతో కొట్టిందని తెలిపింది. కొట్టడంతో బాలుడి కాళ్ళు, వీపు పై వాతలు పడి ఎర్రగా కమిలిపోయి అని వివరించింది.ఆయా పై వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.ఈ ఘటనపై శ్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు.స్థానిక అధికారులు అంగన్వాడీ కేంద్రంలో విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version