ఏపీలో మరో దారుణం..వివాహితపై అఘాయిత్యం చేయబోయిన వాలంటీర్ !

-

ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. వివాహితపై అఘాయిత్యం చేయబోయాడు వాలంటీర్. బాపట్ల – బాప్టిస్టు పాలెంకి చెందిన ఓ వివాహిత ఇంటిముందు అరుగుపై కూర్చొని ఉన్న సమయంలో వాలంటీరు గాలిమోటు లోకకుమార్ ఆమె వద్దకు వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అంటూ ఆమె చేయి పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు.

A volunteer who assaulted a married woman

ఆమె ప్రతిఘటించడంతో కాలితో తన్ని నీ అంతు చూస్తా, నన్ను ఎవ్వడూ ఏం చేయలేరు. నా వెనుక ఎంపీ మోపిదేవి ఉన్నాడంటూ బెదిరించి కాసేపటికి తన బంధువులు, అనుచరులతో కర్రలు తీసుకుని వచ్చాడు. బాధితురాలు వారి దాడి నుంచి తప్పిం చుకుని చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. గతేడాది కూడా ఈ వాలంటీర్ ఇలానే ప్రవర్తించాడని అప్పుడు పోలీసులకు పిర్యాదు చేస్తే పట్టించుకోలేదని. ఇతర మహిళలతో కూడా ఇలానే ప్రవర్తిస్తాడని పింఛన్లు ఇచ్చే నెపంతో ఇళ్లలోకి వచ్చి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. అందుకే అతడిని తాము ఇళ్లకు రానీయడం లేదని వాపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version