టెక్నాలజీ ద్వారా దొంగ ఓట్ల గురించి తెలుసుకో… చంద్రబాబుకి మంత్రి ఆదిమూలపు హెచ్చరిక

-

టెక్నాలజీలో నాకు చాలా తెలుసు.. అని చెప్పుకునే చంద్రబాబు దాని ద్వారానే దొంగ ఓట్లు ఉంటే తెలుసుకోవచ్చు కదా అని సెటైర్లు వేశారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఇవాళ మీడియాతో మాట్లాడారు. టెక్నాలజీతో ప్రతీ ఒక్కటీ కనిపెట్టే చంద్రబాబు ఆధార్ సీడింగ్ ద్వారా ఎవ్వరివి దొంగ ఓట్లో తెలుసుకోవచ్చన్నారు. నగదు బదిలీలో వందలు, వేల కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు హాస్యస్పద ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీఎల్ఓలతో పాటు ఇంటికి సర్వేకి అన్నీ పార్టీలు వెళ్తున్నాయి. దొంగ ఉంటే తెలిసిపోతుందని వెల్లడించారు.

అదేవిధంగా తెలంగాన బీజేపీ నేత బండి సంజయ్ ఇక్కడ ఎవ్వరికీ మద్దతుగా మాట్లాడుతున్నారో ఆయన తెలియాలి. వైసీపీనీ మరోసారి అధికారంలోకి రాకుండా చేయాలని అర్థం లేని ఆరోపణలు తరిమి తరిమి కొడతాం.. బట్టలూడ దీసి కొడతాం అంటూ మహిళలు ఉన్నారని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఎర్రడైరీ ఉంది.. పచ్చడైరీ ఉందంటూ అధికారులను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మీరు వెలగబెట్టినదంతా ప్రజలు చూశారు. టీడీపీ ఏం చేస్తుందో రాష్ట్రం మొత్తం ప్రజలు చూశారు. ఏపీలో ఎక్కడ దొంగ ఓట్లు ఉన్నా తీసేస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version