హీరోలను తిట్టకండి.. ప్లీజ్ : టిడిపి కార్యకర్తలకు అచ్చన్నా విజ్ఞప్తి

-

టిడిపి పార్టీ కార్యకర్తలకు అచ్చాన్నాయుడు విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ లకు విజ్ఞప్తి. ఐప్యాక్, బ్లూ మీడియా ట్రాప్ లో పడకండి. తెలుగుదేశం పార్టీ అందరిదీ. మన పార్టీలో అన్ని మతాల వారు, కులాల వారు, ప్రాంతాల వారు, అదే విధంగా వేర్వేరు ప్రఖ్యాత వ్యక్తుల, నటుల అభిమానులు కూడా ఉంటారని తెలిపారు.

అచ్చెన్నాయుడు

ఒక పార్టీగా, మన ప్రధాన పోరాటం ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రభుత్వం చేసే అరాచకాలపై. అదే విధంగా ప్రభుత్వం వల్ల ఇబ్బందులకు గురైన బాధితులకు అండగా నిలబడడం మన కర్తవ్యం. మన పోరాటం వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో.. ఈ ప్రస్థానంలో మనమంతా, మన దృష్టి అంతా లక్ష్యం పైనే ఉండాలని తెలిపారు.

హీరోల గురించి, వారి అభిమానుల గురించి వెటకారం, ద్వేషంతో కూడిన మాటలు మాట్లాడటం కానీ, పోస్టులు చేయడం గానీ చేయవద్దు. అలా చేసి మన పార్టీలోని కొందరు మనోభావాలను గానీ, వ్యక్తిగతంగా ఆయా వ్యక్తులను, హీరోలను అభిమానించే అభిమానుల మనోభావాలను గానీ గాయపర్చవద్దు. హీరోల, వారి అభిమానుల వివాదాల్లోకి దూరకుండా, తద్వారా మనవైరిపక్షానికి లాభం చేకూర్చకుండా సుశిక్షితులైన సైనికుల వలే మనందరి ఉమ్మడి లక్ష్యం అయిన ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం కలిసికట్టుగా పోరాడదాం. పార్టీలోని అందరి అభిప్రాయాలను గౌరవించుదాం. జై తెలుగుదేశం అంటూ పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version