రేపు జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 2,667 ఉండగా.. మొత్తం 20 పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేసారు. 144 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అయితే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చు. అయితే జంగారెడ్డిగూడెం డివిజన్ లో 1074 మంది ఓటర్లు, ఏలూరు డివిజన్ లో భారీగా 1593 మంది ఓటర్లు ఉన్నారు.
ఇక అత్యధికంగా ఏలూరు అర్బన్ లో 896 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అలాగే అతి తక్కువగా కుక్కునూరు లో 6 గురు ఓటర్లు మాత్రమే నమోదు చేసుకొని.. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్ లో 1074 మంది ఓటర్లు, ఏలూరు డివిజన్ భారీగా 1593 మంది ఓటర్లు ఉన్నారు.