ఆంధ్రప్రదేశ్ ఆటవిక రాజ్యం కొనసాగుతోంది..!

-

ఆంధ్రప్రదేశ్ ఆటవిక రాజ్యం కొనసాగుతోంది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ చేసారు . ఏపీలో లా అండ్ ఆర్డర్ దారుణంగా పడిపోయింది. ఒంటేరు నాగరాజు అనే మా కార్యకర్తని కిడ్నాప్ చేశారు అని తెలిపారు. ఈ విషయంలో ఎస్పీతో కూడా మాట్లాడాం. నాగరాజుకు ఏ విధమైన హాని జరిగినా చంద్రబాబు బాధ్యత వహించాలి అని పేర్కొన్నారు.

బెయిల్ మీద బయట వచ్చి కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తి ని కిడ్నాప్ చేశారు. నాగరాజు కుటుంబ సభ్యులను కొట్టి టీడీపీ గూండాలు కిడ్నాప్ కి దిగారు. నడిరోడ్డు మీద హత్యలు, కిడ్నాప్ లు జరుగుతున్నాయి. అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్టా? లేనట్టా?.. రాష్ట్రాన్ని మణిపూర్, బీహార్ లాగ మార్చారు. టీడీపీ నేతలు ఏం చేసినా పోలీసులు వారిని ఏమీ అనటానికి వీల్లేదని హోంమంత్రి నుండే ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఆటవిక రాజ్యం కొనసాగుతోంది. ఈ విషయంలో పోలీసులు వెంటనే స్పందించి నాగరాజును కాపాడాలి అని అంబటి రాంబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version