తర్వలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రకటన చేశారు. నిన్న ఇరిగేషన్ శాఖా మంత్రి గా అంబటి రాంబాబు బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన పదవిని ముఖ్యమంత్రి నాకు అప్పగించారన్నారు.
దానిని సమర్ధవంతంగా నా బాధ్యతను పూర్తి చేస్తానని వెల్లడించారు. పోలవరం విషయంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. రాయలసీమ సాగు నీటి విషయంలో కూడా చర్యలు తీసుకుంటామని… పోలవరం పూర్తయితే రాయలసీమకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.
వైసిపీలో కొత్త మంత్రి వర్గ విస్తరణ వల్ల ఏర్పడిన అసంతృతప్తి తాత్కాలికమేనని పేర్కొన్నారు. ఐదేళ్ళూ ఒకే మంత్రి వర్గం ఉండాలన్నది సరైంది కాదని… ఎవరికి ఏ పోర్టు ఫోలియో ఇవ్వాలి, మార్పులు చేర్పులు అనేవి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇష్ట మన్నారు. అన్ని శాఖలు ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాయన్నారు.