ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సగటు సముద్ర మట్టం వద్దగల రుతుపవన ద్రోణి ఇప్పుడు డెహ్రాడూన్, ఒరై మీదుగా వాయుగుండము.. కేంద్రం గుండా, ఇప్పుడు ఈశాన్య ఛత్తీస్‌గఢ్ మరియు దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, గోపాల్‌పూర్‌లో మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంను కు ఆగ్నేయ దిశగా కొనసాగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ & యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైఋతి, వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయి.
కాబట్టి ఈరోజు, రేపు మరియు ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు రాయలసీమలో కూడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది