9 చోట్ల ఈవీఎంలు పగలగొడితే…పిన్నెల్లి వీడియోనే ఎందుకు వచ్చిందని నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నిలదీశారు. పోలింగ్ రోజు టిడిపి రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని తెలిపారు. “టిడిపి రిగ్గింగ్ చేసిన చోట రీపోలింగ్ నిర్వహించాలి. 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్కటే వీడియో బయటకు రావడం ఏంటి? టిడిపి నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు? ఈసీ తీరుపై మాకు అనుమానాలు ఉన్నాయి.
దీనిపై న్యాయ పోరాటం చేస్తాం” అని ఆయన పేర్కొన్నారు. మాచర్లలో 4 వేలు ఓట్లు ఉన్న బూతుల్లో డిఎస్పి స్థాయి అధికారులు నియమించారు…పాలవాయి జంక్షన్లో రిగ్గింగ్ జరుగుతుందన్న మా ఫిర్యాదు ను పోలీసులు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఎస్సీ బీసీలను బెదిరిస్తూ దాడులు చేశారు.. ఎన్నికల్లో 9 చోట్ల ఈవీఎంలు పగలగొడితే, ఒక్క మాచర్ల ఎంఎల్ఏ రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం విజువల్స్ బయటికి ఎందుకు వచ్చాయని తెలిపారు. దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి..
ఎన్నికల కమిషన్ పారదర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.