దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య ఎల్లోమీడియా, దౌర్భాగ్య దత్తపుత్రుడు ఉండటం రాష్ట్రం చేసుకున్న కర్మ అని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. వీరంతా కలిసి రాష్ట్ర పరువును తాకట్టుపెడుతున్నారని మండిపడ్డారు. ఇవేవీ నన్ను కదిలించలేవు, బెదిరించ లేవని… దేవుడు దయ వల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల ఈ స్థాయికి వచ్చానని జగన్ అన్నారు. వాళ్ల నా వెంట్రుక కూడా పీకలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.
పాలనా సంస్కరణల్లో భాగంగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని… పేదరికంతో ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో విద్యారంగాన్ని పూర్తిగా మార్చేందుకు అడుగులు వేశాం అని జగన్ అన్నారు. అరకొర కాకుండా ఫీజు రీఎంబర్స్ మెంట్ వర్తింప చేస్తున్నాం అని అన్నారు. చంద్రబాబు చేసిన అప్పులు కూడా మేమే తీర్చుతున్నాం అని అన్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు 34 నెలల కాలంలో రూ. 10298 కోట్లు ఖర్చు చేశామని… ఇలాంటివి కాకుండా చంద్రబాబు ఆయన ఎల్లో మీడియా చిక్కీ కవర్ పైన జగన్ ఫోటో ఉందని రాస్తున్నారని విమర్శించారు. ఈ కడుపు మంట ఎక్కువైతే ఖచ్చితంగా వీళ్లకు బీపీలు వస్తాయని… ఏదో రోజు గుండెపోటు వచ్చి టికెట్ కొంటారని సెటైర్లు వేశారు.