ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై ఏపీ ప్రభుత్వం నిఘా పెట్టింది. గ్రామ, వార్డు సచివాలయాలు సహా ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులపై పర్యవేక్షణ చేయనుంది ఏపీ సర్కార్. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీల నిమిత్తం ఫ్లయింగ్ స్క్వాడ్ల నియామకానికి చర్యలు తీసుకోనుంది.
జిల్లాల్లోని వివిధ శాఖలకు చెందిన అధికారులతో డివిజన్ల వారీగా ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించుకోవాలని సూచనలు చేసింది జగన్ సర్కార్. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు కలెక్టర్లు. అటెండెన్స్ వేసేసి.. కొందరు ఆఫీసుల నుంచి వెళ్లిపోతున్నారనే ఫీడ్ బ్యాకుతో ఆకస్మిక తనిఖీలకు ప్రత్యేక వ్యవస్థ రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్.