ప్రభుత్వ పోర్టల్‌ ద్వారానే సినిమా టిక్కెట్లు విక్రయించాలి : ఏపీ సర్కార్‌

-

సినిమా థియేటర్లకు జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఏర్పాటు చేసినటు వంటి పోర్టర్‌ ద్వారానే సినిమా టికెట్లను అమ్మాలని జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌.. థియేటర్ల యజమానులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్‌ లలో కాన్ఫరెన్స్‌ హాలు లో ప్రభుత్వ ఉన్నతాధికారులు థియేటర్‌ యజమానులతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. బుక్‌ చేసుకున్న సినిమా టిక్కెట్‌ను వినియోగదారుడు నాలుగు గంటల ముందు రద్దు చేసుకుంటే థియేటర్ల యజమానులు జీఎస్టీ, సర్వీసు చార్జీలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయాలని ఏపీ సర్కార్‌ స్పష్టం చేశారు. జీఓ నంబర్‌ 69 ప్రకారం సినిమా టిక్కెట్లను ప్రభుత్వ పోర్టల్‌ ద్వారానే విక్రయించాలని ప్రభుత్వం పేర్కొంది. సినిమా ప్రదర్శన కంటే ఏడు రోజుల ముందు టిక్కెట్లను విక్రయించరాదని హెచ్చరించింది జగన్‌ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news