ముంబై నటి జత్వని కేసుకు సంబధించి ఏపీ హై కోర్టు కొన్ని నెలలుగా విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్ బెయిల్ పై తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హై కోర్టు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేసాడు నిందితుడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్. అయితే బెయిల్ పై జత్వానీ, పోలీసుల తరుపు వాదనలు వినిపించారు న్యాయవాది నర్రా శ్రీనివాస్,పీపీ లక్ష్మీ నారాయణ.
బెయిల్ మంజూరు చేస్తే నిందితుడు కేసును ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపారు న్యాయవాది నర్రా శ్రీనివాస్. అయితే నిందితుడు విద్యాసాగర్ తరుపు వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి. నిందితుడు ఇప్పటికే 76 రోజులుగా జైలులో ఉన్నాడని కోర్టుకు తెలిపిన విద్యాసాగర్ తరుపు న్యాయవాది. అయితే ఇందులో ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న హై కోర్ట్ తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 9న బెయిల్ పై ఆర్డర్స్ ఇవ్వనుంది హైకోర్టు.