ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐదు రోజులపాటు సమావే శాలు నిర్వ హిస్తారని ప్రాథమికంగా తెలుస్తున్న, సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై అంతిమ నిర్ణయం తీసుకుంటుంది.
రాష్ట్రంలో రాజకీయంగా హీటెక్కుతున్న ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ సమావేశాల్లో వైఏస్సార్ సిపి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లు కొన్ని కారణాలతో నిలిచిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అందులోని లోటు పాట్లను సవరించి మళ్లీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.