నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలకు సర్వం సిద్దం అయింది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగనుంది ఈ ఉప ఎన్నిక. ఇక ఈ నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు రెండు లక్షల 13 వేల 338 మంది ఉండగా.. మహిళా ఓటర్లు లక్షా 7 వేల 367 మంది.. పురుష ఓటర్లు లక్షా 05 వేల 960 మంది ఉన్నారు.
అలాగే.. పోలింగ్ కోసం 279 కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఎన్నికలకు మొత్తం 377 ఈవీఎంలు సిద్ధం చేయగా.. ఎన్నికల నిర్వహణకు 1132 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. 148 మంది మైక్రో అబ్జర్వర్లు ఉండనుండగా… సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా 123 గుర్తించారు అధికారులు.
పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షినకు వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. మొత్తం 1023 మంది పోలీసులతో పాటు మూడు కంపెనీల కేంద్ర బలగాలు ఉండగా.. వైసీపీ, బీజేపీతో పాటు బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు ఉన్నారు. కాగా.. మేకపాటి మృతి కారణంగా ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే.