టీటీడీపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. భక్తులకు క్షమాపణలు చెప్పాల్సిందే

తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల కష్టాల పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. వేలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే టీటీడీ ఏమి చేస్తుంది ? అని నిలదీశారు. భక్తులకు సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమని అగ్రహించారు. భక్తులకు తాగునీరు సదుపాయం, క్యూ లైన్లలో నీడ కూడా కల్పించ లేదు.. భక్తులపై ఇంతటి నిర్లక్ష్యమా ? అని ఫైర్ అయ్యారు చంద్రబాబు.

టీటీడీ నిర్ణయాలు శ్రీవారిని భక్తులకు దూరం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. దర్శనాలు, వసతి వంటి అంశాల్లో మొదటి నుంచి ఇదే తరహా అలసత్వం టీటీడీలో కనిపిస్తుందని నిప్పులు చెరిగారు చంద్రబాబు. తిరుమల లాంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆదాయ వనరు కోణంలోనే టీటీడి చూస్తుందన్నారు. కొండ పైకి వెళ్ళ డానికి కూడా ఆంక్షలు విధించడం భక్తుల మనో భావాలను దెబ్బ తీయడమే అని అగ్రహించారు చంద్రబాబు. భక్తులకు టీటీడీ క్షమాపణ లు చెప్పి.. వెంటనే టీటీడీ పాలక మండలి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.