BREAKING: చంద్రగిరిలో రీపోలింగ్ కు ఛాన్స్ ఉందా…? అయితే.. తాజాగా తిరుపతి(D) చంద్రగిరిలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైసిపి డిమాండ్ చేస్తుంది 64, 110, 156, 157 బూత్ లలో రీ పోలింగ్ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారులకు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ విజ్ఞప్తిని ఈసీకి నివేదిస్తామని అధికారులు బదులిచ్చారు. కాగా చంద్రగిరి నుంచి వైసిపి తరఫున చెవిరెడ్డి కుమారుడు మోహిత్, టిడిపి తరఫున పులివర్తి నాని పోటీ చేశారు. అటు చంద్రగిరిలో 144 సెక్షన్..కొనసాగుతోంది. పోలింగ్ తర్వాత అలర్ల ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 8కు ప్తెగా కేసులు నమోదు చేసినట్లు సమాచారం అందుతోంది.
ఇరు పార్టీలలో 71 మందికి పైగా ముద్దాయిలను గుర్తించిన పోలీసులు….ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోలింగ్ రోజు బ్రాహ్మణ కాల్వలో 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు బిఎస్ఎఫ్ జవాన్. మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర గన్ మాన్ 2 రెండ్లు కాల్పులు జరిపారు. అటు నేతల ఇళ్ల వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.