ఏపీ రాజ్ భవన్ లో “ఎట్ హోం” కి హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

-

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఏపీ రాజభవన్ లో ‘ఎట్ హోం’ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు, ఉప ముఖ్యమంత్రి షన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, నారాయణ, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సవిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎస్, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version