అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ – వై.వి సుబ్బారెడ్డి

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుని అన్ని ఆధారాలతోనే ఏపీ సిఐడి అరెస్టు చేసింది అని తెలిపారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. ఆదివారం బాపట్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు చేపట్టాలంటే నాలుగేళ్లు పట్టేదా..? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే కక్ష సాధింపు చర్యలు చేపట్టే వాళ్లమన్నారు వైవి సుబ్బారెడ్డి.

స్కిల్ డెవలప్మెంట్ స్కీం కోసం కేటాయించిన కోట్లాది రూపాయలలో అవినీతి జరిగిందని అసెంబ్లీలోనే సీఎం జగన్ ప్రస్తావించారని గుర్తు చేశారు. షెల్ కంపెనీలకు నగదు బదలాయించి ఎలా అవినీతికి పాల్పడ్డారో పూర్తి ఆధారాలతో కోర్టులో సబ్మిట్ చేయడం జరిగిందన్నారు. చట్టానికి ఎవరు అతీతులు కారన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టం చేశారు వై.వి సుబ్బారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version