ఈ నెల 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో సీఎం జగన్ పర్యటన

-

 

ఈ నెల 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. ఈ నెల 16వ తేదీన ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. విశాఖ మధురవాడలోని ఐటీ హిల్‌ నెంబర్‌ 2 వద్ద ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు సీఎం వైఎస్‌ జగన్‌.

CM Jagan’s visit to Visakhapatnam and Anakapalli districts on 16th of this month

హెలీప్యాడ్‌ వద్ద జీవీఎంసీ బీచ్‌ క్లీనింగ్‌ మిషన్లు ప్రారంభించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. అనంతరం అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో యుజియా స్టెరైల్‌ ప్రెవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు సీఎం వైఎస్‌ జగన్‌. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం వైఎస్‌ జగన్‌. అచ్యుతాపురం ఏపీసెజ్‌కు లో లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌ 2 ఫార్ములేషన్‌ బ్లాక్‌ ప్రారంభించనున్నారు. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version