నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన..

-

నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనుంది. ఈ సందర్భంగా నాలుగో విడత చేయూత నిధులను విడుదల చేయనున్నారు సీఎం జగన్‌. అయితే…CM జగన్‌ అనకాపల్లి జిల్లా పర్యటనతో అనకాపల్లి జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లీంపులకు నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. ఉదయం 9. 30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భారీ వాహనాలు మళ్లింపులు చేయనున్నారు.

అటు విశాఖపట్నం నుంచి తుని వైపు వెళ్లే వాహనాలు లంకెలపాలెం జంక్షన్ – పరవాడ – అచ్యుతాపురం – ఎలమంచిలి – రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని చేరుకోవాలని పోలీసులు ఆదేశించారు. తుని నుంచి విశాఖపట్నం వైపు వాహనాలు వెళ్లేందుకు తుని – రేగుపాలెం జంక్షన్ – ఎలమంచిలి బైపాస్ – అచ్యుతాపురం – పరవాడ – లంకెలపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా విశాఖపట్నం చేరుకోవాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version