సీఎం జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వైయస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళా-2లో రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం జగన్ ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరుతారు.
అనంతరం గుంటూరు పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని చుట్టగుంట వెళ్తారు. అక్కడ ఏర్పాటుచేసిన యంత్రసేవా పథకం మెగా మేళ-2లో పాల్గొని తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. కాగా,పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు నేటి నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 2న ఫస్ట్ లాంగ్వేజ్, 3న సెకండ్ లాంగ్వేజ్, 5న ఇంగ్లీష్, 6న మ్యాథ్స్, 7న సైన్స్, 8న సోషల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒరిజినల్ ఐడికార్డు తీసుకెళ్లాలి. పరీక్షకు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.