సీఐ కొండలరావు విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్లు లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కొండలరావు మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రతివారం మేము కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం. స్టేషన్ పరిధిలోని ఉన్న 172 మంది రౌడీ షీటర్ల పై నిరంతరం నిఘా పెడుతున్నాం. ప్రతి ఆదివారం నిర్వహించే కౌన్సిలింగ్ లో నేరా ప్రవృత్తి కలిగిన షీటర్ల లను హెచ్చరిస్తున్నాం. తమ నేర ప్రవృత్తిని విడనడి జీవనం సాగించాలని సూచనలు ఇస్తున్నాం.
అయితే తమ నేర ప్రవృత్తిని విడనాడి మంచి నడవడికతో జీవనం సాగిస్తే వారి మీద ఉన్న రౌడీ షీట్లు ఎత్తివేస్తామని కౌన్సిలింగ్ ఇస్తున్నాం. అలా కాదు అని నేర ప్రవృత్తిని విడనాడకుండా నేరాలకు పాల్పడుతూ ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే పీడి యాక్ట్ కేసులు పెట్టి నగర బహిష్కరణకు సైతం వెనుకాడేది లేదు అని షీటర్ల లను హెచ్చరిస్తున్నట్లు సీఐ కొండలరావు పేర్కొన్నారు.