ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జ్యోతి ప్రజ్వలన చేసి సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఉన్న సమయాన్ని పెంచుకోవడం అందుబాటులో ఉన్న సమయంలో సాధించగలిగే వాటిని పెంచుకోవడంపై దృష్టి సారించాలని గవర్నర్ సూచించారు.
యాక్సెస్ క్వాలిటీ, ఈక్విటీ స్తోమత, జవాబుదారితనం అనే స్తంభాలపై నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 20-20 ఆధారపడి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధతో ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేలా దృష్టి సారిస్తోందన్నారు. వచ్చే యువత ఐదేళ్ల ఆణిముత్యాలు సమయంలో భారతదేశ నైపుణ్యం కలిగిన మానవ శక్తిగా ప్రపంచం ముందు నిలుస్తుందని తెలిపారు. వికాసిత్ భారత్ కార్యక్రమం ద్వారా 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి దేశంగా మార్చాలని భారత ప్రభుత్వ చర్యలు చేపడుతుందని గవర్నర్ నజీర్ తెలిపారు.