ఆంధ్రలో కరెంట్ తీగల మీద బట్టలు అరేసుకుంటున్నారు – మంత్రి ఎర్రబెల్లి

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు తెలంగాణ వస్తే కరెంట్ తీగల మీద బట్టలు అరేసుకోవాలి అన్నారు.. ఇప్పుడు ఆంధ్రలో కరెంట్ తీగల మీద బట్టలు అరేసుకుంటున్నారని చురకలు అంటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

errabelli dayakar

సంగెం మండలంలోనీ గుంటూరుపల్లి గ్రామంలోరూ.3 కోట్ల 10 లక్షలు,కాపులకనపర్తి గ్రామంలోరూ.8 కోట్ల 18 లక్షలు ,గవిచర్ల గ్రామంలో రూ.14 కోట్ల 19 లక్షలతో మహిళా భవనాలు,సిసి రోడ్లు, బి.టి.రోడ్లు ,కమ్యూనిటీ భవనాలు,గ్రామ పంచాయతీ భవనం,మహిళా సంఘాల భవనాలు ,సబ్ స్టేషన్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం , పలు అభవృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

రైతులకు పంటనష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంగేం మండలం అభివృద్ధికి అత్యధిక నిధులను కేటాయించామని తెలిపారు.  పటిష్టమైన విజన్ తో ముఖ్య మంత్రి కెసిఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి ఇంటికి మంచినీటి నల్లా,టాయిలెట్ ప్రతీ గ్రామానికి బిటి, సిసి రోడ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version