తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి,వైవీ సుబ్బారెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల ఆలయ పరిధిలో ప్రమాణం పేరుతో భూమన చేసిన హైడ్రామాపై ఆయన ఏపీ డిప్యూటీ సీఎం తీవ్రంగా స్పందించారు.లడ్డూ పవిత్రతపై భూమన వ్యంగ్యంగా మాట్లాడారని, భూమన నాశనం మొదలైందని పవన్ ఘాటు విమర్శలుచేశారు. విజిలెన్స్ విచారణకు వైవీ సుబ్బారెడ్డిని పిలిస్తే రికార్డులు ఇవ్వాలా? అని ప్రశ్నించారు.
వైవీ సుబ్బారెడ్డి కచ్చితంగా విచారణకు రావాల్సిందేనని హెచ్చరించారు.జగన్ హయాంలో తిరుమలను అపవిత్రం చేశారని టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై పవన్ ఫైర్ అయ్యారు.తాను శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ధర్మారెడ్డి వ్యహరించిన తీరును పరిశీలించానన్నారు. లడ్డూపై ఇంత వివాదం జరుగుతుంటే ధర్మారెడ్డి ఏటు వెళ్లారని ప్రశ్నించారు.తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారన్నారు. ఆధ్యాత్మిక కేంద్రాన్ని పర్యటక కేంద్రంగా మార్చారని పవన్ ధ్వజమెత్తారు.ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే 11 రోజులు గడవకముందే తిరుమల ఆలయంలోకి వచ్చి ఆపచారం చేశారని గుర్తు చేశారు.