కర్నూలులో దారుణం..3 ఏళ్ల చిన్నారి గొంతు కోసిన తండ్రి

-

కర్నూలులో దారుణం చోటు చేసుకుంది. 3 ఏళ్ల చిన్నారి గొంతు కోశాడు ఓ కసాయి తండ్రి. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూల్‌ జిల్లా కోసిగి మండలం జంపాపురంలో దారుణం జరిగింది. మూడేళ్ళ చిన్నారిని గొంతు కోసి చంపాడు కన్న తండ్రి శాంత కుమార్. బుధ వారం తెల్లవారు జామున తల్లి పక్కన నిద్రిస్తున్న సమయంలో కత్తితో గొంతుకోశాడు తండ్రి.

Father of 3-year-old child’s throat slit

భార్య సంపూర్ణ ఇంటికి ఇల్లరికం వెళ్లాడు చిన్నారి తండ్రి శాంత కుమార్. శాంత కుమార్ సొంత ఊరు మంత్రాలయం మండలం కగ్గళ్ళు. అయితే… మద్యం కు బానిసైన శాంతికుమార్… కొంతకాలంగా సైకోగా ప్రవర్తిస్తూ భార్యను కొడుతున్నాడు. ఈ తరుణంలోనే.. మూడేళ్ళ చిన్నారిని గొంతు కోసి చంపాడు కన్న తండ్రి శాంత కుమార్. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version