వైఎస్‌ జగన్‌ పుంగనూరు పర్యటన రద్దు

-

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పుంగనూరు పర్యటన రద్దు కావడం జరిగింది.. ఈ నెల 9న పుంగనూరులో పర్యటించాల్సి ఉన్న జగన్‌..తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటన చేశారు. చిన్నారి మృతి అందరినీ కలచి వేసిందని… కర్నూలు లో లాగా మళ్ళీ ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తుంది అని వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన ఖరారు చేశారన్నారు. వైఎస్ జగన్ పర్యటన అనగానే హడావిడిగా ముగ్గురు మంత్రులు పుంగనూరు లో పర్యటించారని… పోలీసులు కూడా ముగ్గురు దోషులను అరెస్టు చూపించారని తెలిపారు.

Former CM YS Jagan’s Punganur visit cancelled

వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నామని.. ఈ నేపద్యంలో వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు చేసుకోవడం జరిగిందని చెప్పారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇదే శ్రద్ధ కర్నూలు ఘటన జరిగినప్పుడు చూపించి ఉంటే ఆ అమ్మాయి ఆచూకీ లభించేదని.. వైఎస్ జగన్ పర్యటిస్తే ఇక రాష్ట్రం లో చర్చ మొదలవుతుందని పుంగనూరు ఘటన పై ప్రభుత్వం వేగంగా స్పందించిందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి… రెడ్ బుక్ రాజ్యంగా అంటూ ప్రభుత్వమే దాడులకు ప్రేరేపిస్తుందని ఆగ్రహించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version