నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈనెల 16న మెగా జాబ్ మేళా..!

-

ఎంతో మంది నిరుద్యోగ యువత జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటారు. అంతేకాదు కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు ఇంటర్, డిగ్రీ లోనే చదువు మానేసిన వారు చాలా మంది ఉండవచ్చు. అటువంటి వారు జాబ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏకంగా 1900 మంది ఉపాధి కల్పించబోతున్నారు. ఇది డైరెక్ట్ రిక్రూట్ మెంట్ జాబ్ రానటువంటి నిరుద్యోగ యువతి, యువకులకు ఇది శుభవార్త గా చెప్పవచ్చు.

చిత్తూరు జిల్లా, పుత్తూరు పట్టణంలో SRS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 16 న మెగా జాబ్ మేళా నిర్వహిస్తునట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏపీ కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. నగరి నోడల్ డిగ్రీ కళాశాల, సత్య వేడు కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. గత విద్యార్థులు కూడా అర్హులుగా చెప్పారు. విద్యార్థులు 4 బయోడేటా కాపీలు, 4 పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, సర్టిఫికేట్స్ తో మార్చి 16 న ఉదయం 9.00 గంటలకు కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరవ్వాలని సూచించారు. ఈ జాబ్ మేళా నందు 20 కంపెనీల పాల్గొని, ఈ జాబ్ మేళాలో సుమారు
1900 ఉద్యోగాలకు అవకాశం ఉందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version