TTD : కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

-

TTD : కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. తిరుమల టిటిడి పాలకమండలి నిన్న కీలక నిర్ణయాలు తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చెయ్యాలన్న ప్రభుత్వ జిఓ నెంబర్ 114 మేరకు అర్హత వున్న ఉద్యోగులను టిటిడిలో రెగ్యులరైజ్ చేస్తామని టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాని అలిపిరి వద్ద 23వ తేది నుంచి ప్రారంభిస్తూన్నామని.. హోమంలో పాల్గోనే భక్తులు వెయ్యు రుపాయాలు చెల్లించి టిక్కేట్టు పోందవలసి వుంటుందన్నారు.

Good news for TTD contract employees

హోమాని నిరంతరాయంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తామని.. టిటిడి ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాల పేట వద్ద గ్రావెల్ రోడ్డు నిర్మాణంకు 25.67 కోట్లు కేటాయింపు…విటిని తిరిగి ఉద్యోగులు నుంచి రిఎంబర్స్ చేసూకుంటామని చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి. టిటిడిలో ప్రతి ఒక్క ఉద్యోగికి ఇంటి స్థలాలు కేటాయిస్తామని.. తిరుపతిలోని రామ్ నగర్ క్వార్టర్స్ అభివృద్ది పనులుకు 6.15 కోట్లు కేటాయింపు చేస్తామని వివరించారు. టిటిడి ఉద్యోగులుకు బ్రహ్మోత్సవ బహుమానం గా 14 వేలు….కాంట్రక్ట్ ఉద్యోగులుకు 6850 చెల్లిస్తామని..ప్రసాదాలు ముడిసరుకులు నిల్వ వుంచడానికి 11 కోట్లతో అలిపిరి వద్ద గోడౌన్లు నిర్మాణం చేపడతామని ప్రకటన చేశారు భూమన కరుణాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version