వైసీపీకి భయపడే ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుంది – గుడివాడ అమర్నాథ్

-

వైసీపీకి భయపడే ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుందని చురకలు అంటించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖ ఎండాడ YSRCP కార్యాలయంలో జాతీయ జెండా అవిష్కరించారు రాజ్య సభ సభ్యుడు గొల్ల బాబు రావు..మాజీ మంత్రి అమర్ నాధ్. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ… ఆంధ్రలో మాత్రం స్వతంత్రం పోయి సుమారు రెండు మాసాలు పూర్తి అయిందన్నారు. ఇప్పటి వరకు సుమారు 30 కు పైగా వైసిపి కార్యకర్తలు హత్య చేయబడ్డారని ఆగ్రహించారు.

gudiwada amarnadh counter to prasanth kishore

500 పైగా దౌర్జన్యాలు దోపిడిలు జరిగాయి..కూటమి ప్రభుత్వానికి కాస్త సమయాన్ని మేము ఇస్తున్నామన్నారు. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క హామి అమలు చేయండి…అసెంబ్లీ సాక్షిగా మీ మాటలను ప్రజలందరు చూస్తున్నారని తెలిపారు. విశాఖలో గత కొద్ది రోజుల క్రితమే రెండు కంపెనీలు వెళ్లిపోయాయి…భోగాపురం విమానాశ్రయం మేమే శంకుస్థాపన చేశామని వివరించారు. 16 మెడికల్ కళాశాలలు,బందరు రామయ్య పురం మూలపాటు పోర్టులు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మేము శంకుస్థాపనలు చేశామని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడడానికి కనీసం వాళ్ళకి అభ్యర్థి కూడా లేరు.. భయపడే ఎమ్మెల్సీ ఎన్నికలు నుంచి తప్పుకున్నారని సెటైర్లు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version