స్కూల్స్ రీ ఓపెన్​పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

-

సమ్మర్ హాలీడేస్ అయిపోయాయి. ఈరోజుతో విద్యార్థుల అల్లరికి కళ్లెం పడబోతోంది. రేపటి నుంచి స్కూల్స్ పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్కూల్స్ రీ ఓపెన్​పై కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలుల దృష్ట్యా రేపటి నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. వేడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాఠశాలల ప్రారంభ తేదీని వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నప్పటికీ ఒంటి పూట బడుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ నెల 19వ తేదీ నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూలు ప్రకారం పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version