ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. ఆ నెల 22 వరకు భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించింది వాతావరణ శాఖ. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో 0-3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో మూడు రోజులపాటు వర్ష సూచనను తెలిపింది భారత వాతావరణ శాఖ.
రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోట, గుణ, ఈశాన్య విదర్భ & పొరుగు ప్రాంతంలో ఉన్న అల్పపీడన ప్రాంత కేంద్రం రాయ్‌పూర్, పరదీప్ గుండా ప్రయాణిస్తూ మరియు ఆగ్నేయ దిశగా,తూర్పు మధ్యకు బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు పడమర గాలులు వీస్తున్నాయి. దీంతో ఆ నెల 22 వరకు భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించింది వాతావరణ శాఖ.