తెలంగాణ విద్యార్థులకు అలర్ఠ్…ఇంటర్ ప్రవేశాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్ లో ప్రవేశాలు చేపట్టే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ ఏడాదికి పాత పద్ధతే అనుసరిస్తామన్నారు.
జూన్-1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. త్వరలో ప్రవేశాల షెడ్యూల్ జారీ చేస్తామని, వారంలోగా ప్రైవేట్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఇక అటు తెలంగాణ టెన్త్ ఫలితాలకు ముహుర్తం ఫిక్స్ చేశారు. పదో తరగతి ఫలితాలు బుధవారం అంటే ఇవాళ వెల్లడి కానున్నాయి. మంత్రి సబిత ఇంద్రారెడ్డి… తెలంగాణ టెన్త్ ఫలితాలను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తారు. 4.8 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. కాబట్టి టెన్త్ రిజల్ట్ అందరి కంటే ముందుగా manabadi.com లో తెలుసుకోవచ్చు.