ఉద్యోగుల అటెండెన్స్ పై జగన్‌ ప్రభుత్వం సీరియస్…!

-

ఉద్యోగుల అటెండెన్స్ పై జగన్‌ ప్రభుత్వం సీరియస్ అయింది. ఫేషియల్ రికగ్నేషన్ విధానం-FRS ద్వారా పూర్తి స్థాయిలో ఉద్యోగుల అటెండెన్స్ వేయడం లేదంటూ ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం అందుతోంది. ఫేస్ రికగ్నేషన్ యాప్ ను 100 శాతం ఎన్రోల్ చేసుకోలేదని జీఏడీ పేర్కొన్నారు. ఇప్పటికీ కేవలం 45-50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే FRS ద్వారా అటెండెన్స్ వేస్తున్నారని గుర్తించింది జీఏడీ.

చాలా మంది ఉద్యోగులు ఉదయం FRS ద్వారా చెక్ ఇన్ అవుతున్నారు కానీ.. చెక్ అవుట్ కాకపోవడంపై జీఏడీ అభ్యంతరం తెలిపింది. ఉద్యోగుల శెలవులను FRS విధానం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉన్నా.. దాన్ని ఫాలో కావడం లేదంటోన్నారు జీఏడీ. ఇన్ఛార్జుల పర్యవేక్షణా లోపం వల్లే FRS అమలు సరిగా లేదని వెల్లడించింది ప్రభుత్వం. FRS సరిగా అమలయ్యేలా ఇన్ఛార్జులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్‌. ఈ మేరకు అన్ని శాఖల సెక్రటరీలు.. హెచ్వోడీలు, జిల్లా కలెక్టర్లకు మెమో జారీ చేశారు జీఏడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version