ఆర్టీసీ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ దిమ్మతిరిగే షాక్‌ !

-

ఆర్టీసీ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. ఆగస్టు నెల కూడా మళ్లీ పాత జీతాలే అకౌంటులలో జమ కానున్నాయి. ఈ మేరకు అధికారులు జీతాల బిల్లులను మంగళవారం అప్లోడ్ చేశారు. ఆగస్టు జీతాన్ని కొత్త పిఆర్సి తో చెల్లిస్తామని ఎండి ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో ఆ ప్రక్రియ పూర్తికాలేదు.

ఆర్థిక శాఖ ఇచ్చిన సాఫ్ట్ వేర్ ప్రోగ్రాంలో జీతాల వివరాలను ఎంట్రీ చేసేందుకు ప్రయత్నించగా, అందులో చాలా వరకు తప్పులు చూపించాయి. దీంతో కొత్త పి అర్ సి జీతాలు చెల్లించడం కుదరలేదు. జూన్ 3న ఆర్టీసీ ఉద్యోగులకు పి.ఆర్.సి అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అదే నెల నుంచి కొత్త జీతాలు చెల్లిస్తారు అన్నారు. కానీ కొన్ని కారణాలు ఆర్థిక శాఖ కొర్రీలతో పిఆర్సి అమలు కుదరలేదు. ఈనెల ప్రభుత్వ అనుమతి లేకుండా 2,000 మంది అధికారులు, ఉద్యోగులకు పదోన్నతులు ఎలా ఇస్తారని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. దీంతో అధికారులు చర్చలు జరిపి, పదోన్నతులు పొందినవారు మినహా మిగిలిన 49 వేల మందికి కొత్త జీతాలు ఇవ్వాలని నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news