ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాండూస్ తుఫాన్ భీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ మాండూస్ తుఫాను, భారీ వర్షాలపై క్యాంపు ఆఫీసులో ఉదయం 11:30 గంటలకు సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కీలక సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు హాజరు అ య్యారు.
ఇక ఈ సందర్బంగా సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఆదేశించారు. అటు ఈ భీభత్సం వల్ల మరణించిన వారికి నష్ట పరిహారం చెల్లించాల్సిన కూడా పేర్కొన్నారు సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి. అలాగే రైతులకు పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలని, దాని కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి.