సీఎం జగన్ కు మద్దతు ఇవ్వడంపై జేబీఎన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన చేశారు. జేబీఎన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ…. నేను జగనుకు అనుకూలంగా ఉన్నాననే విమర్శలు వచ్చినా నేను పట్టించుకోను….మా పార్టీ ప్రజలను గెలిపించడానికే ఉంది.. ఎవర్నో గెలిపించడానికి కాదన్నారు. నాడు-నేడు బాగుందని అన్నాను.. అమ్మఒడి వద్దన్నానని క్లారిటీ ఇచ్చారు.
పాఠళాలల్లో మౌళిక వసతులు బాగున్నాయి…బాగుంటే బాగుందని చెప్పడంలో తప్పేం ఉందన్నారు. వాజ్‌పేయి ఇందిరా గాంధీని దుర్గ దేవితో పోల్చారు.. వాజ్‌పేయి కాంగ్రెస్ పార్టీలో చేరారా..? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయడానికి విశాఖ ఎలాగూ ఉందని వివరించారు.
విశాఖలో చైతన్యవంతమైన ఓటర్లు ఉన్నారన్నారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా నిలబడితే 2.80 లక్షల ఓట్లు వచ్చాయి…ఎన్నికలకు తక్కువ సమయం ఉంది.. అందుకే జెండాలో నా ఫొటో పెట్టానని వివరించారు. ప్రజల్లోకి పార్టీని త్వరగా తీసుకెళ్లేలా జెండా రూపకల్పన అని… ఫొటో పెట్టినంత మాత్రాన పార్టీ మొత్తం లక్ష్మీనారాయణదేనని అర్థం కాదని వివరించారు జేబీఎన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ.