పవన్ కళ్యాణ్ కు బిగ్‌ షాక్‌…హై కోర్టుకు మహిళా వాలంటీర్లు !

-

పవన్ కళ్యాణ్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. హై కోర్టును ఆశ్రయించారు మహిళా వాలంటీర్లు. పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున వ్యాజ్యం దాఖలు చేశారు ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. వాలంటీర్లపై గత ప్రభుత్వంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కూటమి ప్రభుత్వం కేసు ఉపసంహరించుకోవడంపై హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఇద్దరు మహిళా వాలంటర్లు.

lawyer Jada Shravan Kumar filed a case on behalf of women volunteers in the High Court for a retrial of the case against Pawan Kalyan

వైసీపీ ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు కనపడకుండా పోవడానికి వారిని వ్యభిచార కూపంలోకి దించడానికి వాలంటీర్లు కారణమన్న ఆరోపణపై పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు అయింది. దీంతో అప్పటి ప్రభుత్వం… పవన్ కళ్యాణ్ పై కేసు నమోదుకు జీవో కూడా జారీ ఇచ్చింది. అయితే… కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఏ కారణం చూపకుండా పవన్ కళ్యాణ్ పై కేసు ఉపసంహరించుకుంది ప్రభుత్వం. ఈ తరుణంలోనే…. పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున వ్యాజ్యం దాఖలు చేశారు ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. ఈ కేసు రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version