ఏపీలో నడిరోడ్డుపై మద్యం అమ్మకాలు

-

ఏపీలో కొత్తగా ప్రైవేట్ మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాక బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు సంత మార్కెట్లో పలువురు బహిరంగంగా మద్యం అమ్ముతున్నారు. అక్కడ పిల్లలు కూడా కూర్చోని ఉండటం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్టు షాపు నిర్వహిస్తున్న ప్రదేశానికి చేరుకోగా నిర్వాహకులు అక్కడి నుంచి జంప్ అయ్యారు.ఇక మీదట రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని పలువురు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకురావడంతో పాటు టెండర్ల ప్రక్రియ ద్వారా కొత్తగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు నడిపించుకునే వెసలుబాటును కల్పించింది.

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version